Home » GHMC
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలకు కీలక సూచన చేశారు.
అనుభవం లేని సర్వీస్‌కు టెండర్ అప్పగించడంతో సరూర్‌నగర్ చెరువు వద్ద క్రేన్ పల్టీ కొట్టింది. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఏసీ శానిటేషన్ రఘు ప్రసాద్‌తో సమీక్ష నిర్వహించారు.
మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ మేరకు కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో సోమవారం రూ.5లకే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచంద సూచించారు. ప్రధానంగా లోతట్టు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను గమనించి సురక్షిత స్థలాలకు తరలివెళ్లాలని పేర్కొన్నారు.
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చే అంశానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు కలిపే వంతెన పేరు మార్చాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.