GHMC: విలీన మునిసిపాల్టీలకూ ఆన్‌లైన్ సేవలు..
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:04 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం అయిన ఆయా మునిసిపాల్టీలకూ ఆన్‌లైన్ సేవలు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉంచాలని నిర్ణయించారు.
- జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్(GHMC website)లో విలీన మునిసిపాల్టీల పౌర సేవల వివరాలు అందుబాటులో ఉన్నాయి. మెనూ బార్‌లో 27 పూర్వ యూఎల్‌బీస్ పేరిట ఉన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవచ్చు. పన్ను చెల్లింపు, ఆస్తి పన్ను స్వీయ మదింపు, మ్యుటేషన్ దరఖాస్తు, మ్యుటేషన్ రుసుము చెల్లింపు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.

ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తు, రెన్యూవల్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శివారు ప్రాంతాల్లోని 27 మునిసిపాల్టీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పట్టణ స్థానిక సంస్థల ఆన్‌లైన్ సేవలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్(GHMC website)లో అందుబాటులోకి తీసుకొచ్చామని ఓ అధికారి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News