Home » Floods
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు.
సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినట్లు అధికారులు చెబుతున్నారు. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నాడు హోంమంత్రి అనిత ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి..
భారత వాతావరణ శాఖ జమ్మూకశ్మీర్‌లోని పలు ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో మరిన్ని చోట్ల కొండచరియలు విరిగిపడొచ్చని, మెరుపువరదలు సంభవించవచ్చని అప్రమత్తం చేసింది.