Share News

Congress Criticism: వరద బాధితులను రెచ్చగొడుతున్న హరీశ్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:03 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు వరద బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు.

Congress Criticism: వరద బాధితులను రెచ్చగొడుతున్న హరీశ్‌

  • కాంగ్రెస్‌ నేతల ధ్వజం

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు వరద బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. సీఎం, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో వరదలపై సమీక్ష చేస్తుండగా.. హరీశ్‌ మాత్రం బుద్ధి లేకుండా రాజకీయ విమర్శలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఎన్నికలు వస్తున్నందున హరీశ్‌రావు రాజకీయాలు మాట్లాడుతున్నారని.. సీఎంపై ఆయన విమర్శలు సరికాదన్నారు. వరద బాధితులను సర్కారు అన్ని రకాలుగా ఆదుకుంటుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. హరీశ్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Updated Date - Aug 29 , 2025 | 04:03 AM