Home » Fire Accident
దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా రీజియన్‌ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు.
హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో ఉన్న ఒక డెకరేషన్ వస్తువుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తూర్పు చైనాలోని ఒక ప్రముఖ షూ తయారీ కర్మాగారంలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 28 మంది కార్మికులు సజీవదహనమయ్యారు.
కరీంనగర్‌లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.
నోయిడా సెక్టర్ 119 అరణ్య సొసైటీలో భారీ అపార్ట్‌మెంట్‌లోని 21వ అంతస్తులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసి పడ్డడంతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఓ స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ అలీగంజ్‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మెుత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది.
హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. జల్‌పల్లి బాలాజీనగర్‌లో ఉన్న ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.