Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచకప్2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో విజృంభించింది. ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది.
‘1994, 2026’కి ఎంత తేడా! అమెరికా తొలిసారి 1994లో ఫిఫా వరల్డ్‌క్‌పనకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మెక్సికో, కెనడాతో కలసి మరోసారి నిర్వహిస్తోంది...
ఖండాలన్నీ కదంతొక్కే సమరం.. ఊహకందని విన్యాసాలు.. లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు.. అవధుల్లేని ఆనందాలు.. అంతులేని నిర్వేదాలు.. ఇలా భూగోళం మొత్తాన్ని ‘బంతి’లా...
ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు అర్జెంటీనా జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి గాయపడినట్లు సమాచారం.
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి ప్రపంచ వేదికపై మెరవనున్నారు. గతంలో ఫిఫా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన నోరా.. ఇప్పుడు ప్రారంభ వేడుకల్లో మెరవనున్నారు. కేవలం డ్యాన్స్‌తో కాకుండా ఈసారి పాట కూడా పాడనుండటం విశేషం.
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్ జూన్ 11న ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే భాగ్యం భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు లేనట్టేనా..? ఇందుకు కారణంగా..
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగు ప్రత్యేక సీట్ల టికెట్లను ఫిఫా రీసేల్ సైట్ సేల్‌కు పెట్టింది. ఆ టికెట్ల ధర ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు(రూ.21 కోట్లు).
ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ జట్టు.. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్2026లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ దేశంపై దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే తమ జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది.
మెక్సికోలో హింసతో జూన్, జులైలో జరగాల్సిన 2026 వరల్డ్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతుడైన తర్వాత మెక్సికోలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.