Share News

అదరగొట్టిన మెస్సి.. ఐస్‍లాండ్‌పై అర్జెంటీనా ఘన విజయం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:49 PM

ఫిఫా ప్రపంచకప్‌2026 ప్రారంభానికి ముందు డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో విజృంభించింది. ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది.

అదరగొట్టిన మెస్సి.. ఐస్‍లాండ్‌పై అర్జెంటీనా ఘన విజయం
Argentina vs Iceland 2026 warmup

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌ 2026కు ముందు జరిగిన తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అదరగొట్టింది. అలబామా వేదికగా ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. అలానే తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సి.. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆట ప్రారంభంలో ఐస్‌లాండ్ గోల్ చేసే ఒక సులభమైన అవకాశాన్ని వృథా చేసుకుంది. అర్జెంటీనా ప్లేయర్లు ఐస్ లాండ్ కు గోల్ చేసే చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా తీవ్రంగా కట్టడి చేశారు.


మరోవైపు తొలి హాఫ్ ముగుస్తుందనగా మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ అందించిన కీలక పాస్‌తో లౌటారో మార్టినేజ్ గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపాడు. దీంతో తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 10 నిమిషాల్లో రెండో హాఫ్ ముగుస్తుందనగా మళ్లీ మైదానంలోకి వచ్చిన మెస్సీ ఈసారి తానే స్వయంగా గోల్ కొట్టాడు. మార్టినేజ్ అందించిన పాస్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి మెస్సి తన కెరీర్‌లో 117వ గోల్ సాధించాడు.


దీంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా మూడో గోల్ కొట్టడంలో కూడా మెస్సి కీలకపాత్ర పోషించాడు. మె‍స్సీ ఇచ్చిన పాస్‌ను అందుకున్న రోడ్రిగో డి పాల్ దానిని థియాగో అల్మాడాకు పాస్ చేయగా, అతడు బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. దీంతో 3-0తోఅర్జెంటీనా గెలుపు జెండా ఎగరేసింది. మరోవైపు మెస్సి సేన ఫిఫా ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ను ఈనెల16న అల్జీరియాతో ఆడనుంది. అనంతరం ఆస్ట్రియా, జోర్డాన్‌ జట్లలను ఎదుర్కోనుంది. ఇక మెస్సి విషయానికి వస్తే.. మే 24న ఇంటర్ మియామి తరఫున ఆడుతూ కండరాల గాయానికి గురై.. పూర్తిగా కోలుకున్నాడు. మెస్సి ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌లో పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో కనిపించినప్పటికీ కేవలం 20 నిమిషాల పాటే గ్రౌండ్‌లో ఉన్నాడు. తాను ఆడిన 20 నిమిషాల్లోనే రెండు కీలక పాస్‌లు సహా ఒక గోల్ చేసి. అర్జెంటీనా విజయంలో కీలక పాత్రపోషించాడు.


ఇవి కూడా చదవండి:

భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్!

పుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ఘటన! కెమెరా కిందపడి..

Updated Date - Jun 10 , 2026 | 02:26 PM