Share News

పుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ఘటన! కెమెరా కిందపడి..

ABN , Publish Date - Jun 10 , 2026 | 09:49 AM

నాగియెర్డెయ్ స్టేడియంలో హంగేరి, కజకిస్థాన్ జట్ల మధ్య అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. మైదానంలో మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న క్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

పుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ఘటన! కెమెరా కిందపడి..
Hungary Kazakhstan football match

స్పోర్ట్స్ డెస్క్: వివిధ రకాల క్రీడాలు జరుగుతుండగా అప్పుడప్పుడు ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. మైదానంలోకి కుక్క, నక్క, పాము వంటి మూగ జీవాలు హల్‌చల్ చేసిన ఘటనలు అనేకం జరిగాయి. అలానే మరికొన్ని్ సందర్భాల్లో చిన్నపాటి ప్రమాదాలు జరగడం కూడా మనం చూశాము. మైదానంలో ఉన్న బోర్డులు ఎగిరిపోవడం, ప్రేక్షకులకు సమీపంలో పడటం వంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో కూడా కెమెరా ఒకటి అందరినీ భయపెట్టింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


మంగళవారం రాత్రి నాగియెర్డెయ్ స్టేడియంలో హంగేరి, కజకిస్థాన్ జట్ల మధ్య అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. మైదానంలో మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న క్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పిచ్ పైన వేలాడదీసిన స్పైడర్‌ కెమెరా అకస్మాత్తుగా పనిచేయక కింద పడిపోయింది. ఈ కెమెరా పొగలు కక్కుతూ పిచ్‌పై కూలిపోయింది. ఆ కెమెరా సైడ్‌లైన్‌లో ఉన్న ఒక కెమెరామెన్ సమీపంలో పడటంతో ఆటగాళ్లు, అధికారులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.


సిబ్బంది వెంటనే మైదానంలోకి చేరుకుని దెబ్బతిన్న కెమెరాను తొలగించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. నివేదికల ప్రకారం... ఈ ఘటనతో అంపైర్లు మ్యాచ్‌ను వెంటనే నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాసేపు ఆలస్యం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.


ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 10 , 2026 | 10:28 AM