Share News

భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్!

ABN , Publish Date - Jun 10 , 2026 | 10:34 AM

భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.

భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్!
Rohit Sharma fitness update

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత టీమిండియా జట్టు తదుపరి షెడ్యూల్‌కు రెడీ అయింది. త్వరలో ఆఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరం కావడంతో అభిమానులంతా నిరుత్సాహనికి గురయ్యారు. అలానే టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ కూడా సిరీస్ నుంచి దూరం కావచ్చనే వార్తలు బయటకువచ్చాయి. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. ఈ నేపథ్యంలోనే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది.


అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడిన రోహిత్. ఫిట్‌నెస్ పరీక్షను నెగ్గాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. 'రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు. త్వరలోనే జట్టుతో కలిసి తొలి వన్డే నుంచే జట్టుకు అందుబాటులో ఉంటాడు’ అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.


ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య గాయాలతో ఇబ్బంది పడ్డారు. రోహిత్ తొడ కండరాల నొప్పితో బాధపడుతుండగా... హార్దిక్ వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ గాయాలతో ఈ ఇద్దరూ ముంబై తరఫున కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కోలుకొని ఈ ఇద్దరూ బరిలోకి దిగినా.. వారు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి అవసరం ఉందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. దీంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరి రిహాబిలిటేషన్ తీసుకోవడంతో పాటు ఫిట్‌నెస్ టెస్ట్‌ను పూర్తి చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

పుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ఘటన! కెమెరా కిందపడి..

రిటైర్‌మెంట్ ఆలోచనలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్?

Updated Date - Jun 10 , 2026 | 10:56 AM