మీనాక్షి నామినేషన్ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్ నేతలు..
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:42 PM
రాజ్యసభ ఎన్నికలకు ముందు తగిలిన ఎదురుదెబ్బపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
రాజ్యసభ ఎన్నికలకు ముందు తగిలిన ఎదురుదెబ్బపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసింది.
నామినేషన్ దాఖలు సమయంలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఒక కేసుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆరోపించింది (Rajya Sabha Election 2026).
కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ( Congress Delegation). నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..