Share News

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ఇప్పట్లో లేనట్టేనా.. మస్క్ బృందం స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:34 AM

ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్‌ భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అయితే స్టార్‌లింక్‌కు తుది అనుమతుల ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ఇప్పట్లో లేనట్టేనా.. మస్క్ బృందం స్పందన ఏంటంటే..
Elon Musk Starlink

ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్‌ భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అయితే స్టార్‌లింక్‌కు తుది అనుమతుల ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని భద్రతా సంస్థలు స్టార్‌లింక్‌కు అవసరమైన చివరి క్లియరెన్స్ ఇవ్వకుండా నిలిపివేశాయని తెలుస్తోంది (Elon Musk Starlink).


ఇరాన్‌లో అధికారిక లైసెన్స్ లేకపోయినా, అక్కడ జరిగిన ఘర్షణల్లో స్టార్‌లింక్ టెర్మినల్స్‌ను ఉపయోగించారనే నివేదికలు భారత అధికారుల్లో ఆందోళనకు కారణమైనట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్ ఇప్పటికే భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన కొన్ని అనుమతులు పొందినప్పటికీ, వాణిజ్య సేవలు ప్రారంభించడానికి ఇంకా తుది భద్రతా ఆమోదం లభించలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్టార్‌లింక్ కొట్టిపడేసింది (Starlink India approval).


భారత ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది (Starlink launch India). భారత మార్కెట్లో ప్రవేశించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. 'నిరాధార కథనాలకు పూర్తి విరుద్ధంగా భారత ప్రభుత్వంతో వేగంగా చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సేవలు అందించేందుకు అవసరమైన అన్ని నియంత్రణ, సమ్మతి ప్రక్రియల విషయంలో ప్రభుత్వంతో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాం' అని స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..


బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 10 , 2026 | 11:51 AM