Share News

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Jun 10 , 2026 | 10:06 AM

బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్‌‌ఎమ్‌సీజీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఇక, హెవీ వెయిట్ షేర్ అయిన రిలయన్స్ రెండు శాతానికి పైగా లాభపడడం కూడా సూచీలకు కలిసొచ్చింది.

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..
Stock Market

బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్‌‌ఎమ్‌సీజీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఇక, హెవీ వెయిట్ షేర్ అయిన రిలయన్స్ రెండు శాతానికి పైగా లాభపడడం కూడా సూచీలకు కలిసొచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగినప్పటికీ ఆ ప్రభావం క్రూడాయిల్ ధరలపై పెద్దగా కనిపించకపోవడం సానుకూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.43) విలువ స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (73,918)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. భారీగా లాభపడింది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 484 పాయింట్ల లాభంతో 74,403 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 126 పాయింట్ల లాభంతో 23,368 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో కోల్గేట్, హెచ్‌యూఎల్, నెస్ట్లే, డాబర్ రెడ్, అవెన్యూ సూపర్ మార్కెట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, హిందాల్కో, హిందుస్థాన్ జింక్, ఆయిల్ ఇండియా మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 58 పాయింట్ల నష్టంతో ఉంది.


ఇవి కూడా చదవండి

వేప ఆకులే కాదు.. పండు కూడా ఔషధమే!

మేం రాలేం.. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం!

Updated Date - Jun 10 , 2026 | 10:06 AM