అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు పాండ్య దూరం
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:17 AM
మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య జట్టుకు దూరం అయ్యాడు.
స్పోర్ట్స్ డెస్క్: మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు పాండ్య దూరం అయ్యాడు ఈ స్టార్ ఆల్ రౌండర్ జూన్ 2 నుంచి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడనే వార్తలు వచ్చాయి. అతను జూన్ 11న ధర్మశాలలో టీమిండియా జట్టుతో కలవాల్సి ఉంది. కానీ ఈ చివరి నిమిషంలో ఎదురైన ఎదురుదెబ్బ కారణంగా అతను కనీసం మరో రెండు వారాల పాటు బెంగళూరులోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
'ఫిట్ నెస్ సాధించాడు.. జట్టులో చేరుతాడు అనుకున్న చివరి నిమిషంలో పాండ్యకు ఎదురుదెబ్బ తగిలింది. అతని కాలు స్వల్పంగా బెణకడంతో కొంచెం నొప్పి ఏర్పడింది. ఇది దీర్ఘకాలికం కాదు. కానీ రాబోయే కొద్ది రోజులు ఎలాంటి శ్రమ లేదా బరువు మోయడం వంటివి చేయవద్దని వైద్య సిబ్బంది అతనికి సలహా ఇచ్చారు. కోలుకునే సమయంలో హార్దిక్ బెంగళూరులోనే ఉంటూ, సీఓఈ ఫిజియోలు, శిక్షకులతో సంప్రదింపులు జరుపుతాడు. మరో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది' అని ఒక బీసీసీఐ అధికారి . అయితే, పాండ్య ఫిట్‌నెస్‌పై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంతృప్తి వ్యక్తంచేసిన రోజు వ్యవధిలోనే ఈ నిర్ణయం రానుండటం గమనార్హం.
వెన్ను నొప్పితో ఐపీఎల్ 2026లోనూ హార్దిక్ పాండ్య కొన్ని మ్యాచులు ఆడలేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. రోహిత్‌తోపాటు హార్దిక్ కూడా ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యాడు. అంతా ఓకే అనుకున్నాక.. ఇప్పుడు తొడ కండరాల గాయంతో మూడు వారాలు ఆటకు దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. మరి అతడి స్థానంలో ఎవరిని రిప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీ కోసం సన్నద్ధతలో భాగంగా టీమిండియా తొమ్మిది మ్యాచులు ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
భారత జట్టుకు శుభవార్త.. జట్టులోకి ఆ స్టార్ ప్లేయర్!
పుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ఘటన! కెమెరా కిందపడి..