Home » FIFA World Cup
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును పసికూన డీఆర్ కాంగో 1-1 గోల్స్‌తో నిలువరించింది.
టైటిల్ ఫేవరేట్‌లలో ఒకటైన ఫ్రాన్స్ ఫిఫా ప్రపంచకప్2026ను ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో సెనెగల్‌పై ఫ్రాన్స్ విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రియా జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. జోర్డాన్ జట్టుపై 3-1 తేడాతో గెలిచింది. దీంతో 36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో గెలుపు రుచి చూసింది.
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026ను ఘనంగా ప్రారంభించింది. ఇవాళ అర్జెంటీనా జట్టు 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో న్యూజిలాండ్ ప్లేయర్ సర్‌ప్రీత్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి ఆటగాడిగా నిలిచాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సిపై ప్రశంసలు కురిపించాడు.
ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రయాణాన్ని ఇరాన్ జట్టు డ్రాతో ఆరంభించింది. గ్రూప్-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 వేళ ఇరాన్ అభిమానులకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఇరాన్ విప్లవానికి పూర్వం ఉపయోగించిన సూర్యడు, సింహం ఉన్న జెండాను ఫిఫా వేదికలపైకి తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది.
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా బెల్జియం, ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గ్రూప్- జీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో బ్రెజిల్-మొరాకో మ్యాచ్ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో, ప్రముఖ యూట్యూబర్ ఐషోస్పీడ్(స్పీడ్) మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.