Share News

ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు

ABN , Publish Date - Jun 16 , 2026 | 07:33 AM

ఫిఫా ప్రపంచకప్‌ 2026 వేళ ఇరాన్ అభిమానులకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఇరాన్‌ విప్లవానికి పూర్వం ఉపయోగించిన సూర్యడు, సింహం ఉన్న జెండాను ఫిఫా వేదికలపైకి తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది.

ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు
FIFA World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌ 2026 వేళ ఇరాన్ అభిమానులకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఇరాన్‌ విప్లవానికి పూర్వం ఉపయోగించిన సూర్యడు, సింహం ఉన్న జెండాను తీసుకురావడంపై విధించిన నిషేధాన్ని అమెరికా కోర్టు సమర్థించింది. దీంతో ఆ జెండాను స్టేడియాల్లో అనుమతించాలని కోరిన ఇరానియన్‌ మూలాలున్న అభిమానులకు కోర్టులో చుక్కెదురైంది.


ఫిపా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. రాజకీయ, వివక్షపూరిత లేదా వివాదాస్పద చిహ్నాలను ప్రపచం కప్ వేదికలపైకి అనుమతించరాదు. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాయిస్‌ ఆఫ్‌ లిబర్టీ’ అనే సంస్థతో, అందులోని సభ్యుడు సామ్‌ కెర్మానియన్‌ కోర్టును ఆశ్రయించారు. విప్లవానికి పూర్వం ఉపయోగించిన ఇరాన్‌ జెండాను ప్రదర్శించడం ద్వారా ప్రస్తుత ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకతను, ప్రజాస్వామ్య సంస్కరణలకు మద్దతును తెలియజేయాలనుకుంటున్నామని పిటిషనర్లు వాదించారు.


అయితే ఆ జెండాను అనుమతిస్తే అభిమానుల మధ్య ఘర్షణలు, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫిఫా పేర్కొంది. 1979 ఇస్లామిక్‌ విప్లవానికి ముందు, మొహమ్మద్‌ రెజా పహ్లావి పాలనలో ఈ జెండాను ఉపయోగించారు. లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు ఇందుకు సంబంధించి తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఫిఫా అమలు చేస్తున్న నిషేధ నిబంధన కొనసాగనుంది.


ఇవి కూడా చదవండి:

పసికూనల పంజా

సూపర్‌ ఓవర్‌లో ఝలక్‌

Updated Date - Jun 16 , 2026 | 07:34 AM