ప్రపంచ దేశాల హర్షం
ABN , Publish Date - Jun 16 , 2026 | 06:07 AM
అమెరికా- ఇరాన్ యుద్ధానికి తెర దించుతూ ఇరుదేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ముసాయిదా ఒప్పందాన్ని భారత్ సహా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలు...
న్యూఢిల్లీ, జూన్ 15: అమెరికా- ఇరాన్ యుద్ధానికి తెర దించుతూ ఇరుదేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ముసాయిదా ఒప్పందాన్ని భారత్ సహా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో స్వాగతించాయి. ‘‘పశ్చిమాసియాలో నెలకొన్న అశాంతి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానికి ముగింపు పలికేలా రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం అభినందనీయం’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్యానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని ఆకాంక్షించారు. శాంతి ఒప్పందాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్ స్వాగతించారు. ఈ సంక్షోభాన్ని ముగించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించిన పాకిస్థాన్, ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలను ఆయన ప్రశంసించారు. అణ్వాయుధాలు తయారు చేయకూడదన్న నిబంధనకు ఇరాన్ కట్టుబడి ఉండాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు ప్రకటన విడుదల చేశారు. ఒప్పందంలో కీలక పాత్ర పోషించారంటూ పాకిస్థాన్, ఖతార్ దేశాలకు ఇటలీ ప్రధాని మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!