Home » Farmers
రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.
రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. క్యూ లైన్లలో అదేపనిగా నిలబడాల్సి రావడంతో అలసటా తప్పడం లేదు. యవుసం పనులు మానుకొని, క్యూలో నిలబడటానికే రోజంతా సరిపోతోందని..
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని నొక్కిచెప్పారు.
మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ఇంటింటికీ యూరియా ఇస్తామని వెల్లడించారు. రూ.300కంటే ఎక్కువకు యూరియా అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అన్నదాతలు ఆత్మ గౌరవంతో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉందని ఉద్ఘాటించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్‌గా మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుతున్న జగన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైతుపై కేసు నమోదైంది. ఈనెల 4న యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ గోదాం వద్దకు వెళ్లిన రైతు లక్ష్మణ్, అక్కడ భారీగా క్యూ ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఆదుకుంటామని, పంట నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా..