Share News

Marigold Farming: తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. బత్తి సాగు లాభాలివే..

ABN , Publish Date - Sep 25 , 2025 | 10:34 AM

సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వ్యవసాయ అధికారుల సూచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిచే పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కేమ పొచ్చన్న. వడ్డాడికి చెందిన రైతు తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంలో బంతిపూల పంటను సాగు చేసేం దుకు ముందుకొచ్చారు.

Marigold Farming: తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి.. బత్తి సాగు లాభాలివే..
Marigold Farming

  • తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదాయం

  • 100 రోజుల్లో చేతికి పంట

  • బతుకమ్మ పండుగతో బంతి పూలకు భలే డిమాండ్‌

తలమడుగు , సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వ్యవసాయ అధికారుల సూచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిచే పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కేమ పొచ్చన్న. వడ్డాడికి చెందిన రైతు తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంలో బంతిపూల పంట (Marigold Farming)ను సాగు చేసేందుకు ముందుకొచ్చారు. ఉద్యానవనశాఖ అధికారులు అందించిన సలహాలు, సూచనలు పాటించారు. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల పెట్టుబడి పెట్టి రూ.2 లక్షల ఆదాయం పొందారు. తన మిగతా భూమిలో ఎకరం కూర గాయలు, మరో ఎకరం ఆకుకూరలు, ఇంకొక ఎకరంలో బంతిపూలు వేసి ఎకరంలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు. కేవలం 100రోజుల పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.


బతుకమ్మ సీజన్‌ కావడంతో డిమాండ్‌..

ప్రస్తుతం బతుకమ్మ పండుగ సీజన్‌ కావడం తో బంతిపూలకు భలే డిమాండ్‌ పెరిగింది. కిలో బంతిపూలు రూ.100-150 ధర పలుకుతోంది. బ తుకమ్మ పండుగ సీజన్‌ కావడంతో డిమాండ్‌ పెరగడంతో లాభాలను గడిస్తున్నారు. పూలు కావాల్సిన వారు పొచ్చెన్న పొలానికి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. తలమడుగు, కొత్తూరు, లింగి, కుచులాపూర్‌లో ఇలాంటి రూతులు చాలామంది ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఇంకొంత మంది రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన

ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా 10 డిపోలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 11:10 AM