జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ప్రయోజనం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:33 AM
ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో ప్రయోజనం చూకూరుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, ఏడీఏ మహుమ్మద్‌ఖాద్రీ, జీఎస్టీ అధికారి వెంకటరమణ అన్నారు.
గోనెగండ్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో ప్రయోజనం చూకూరుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, ఏడీఏ మహుమ్మద్‌ఖాద్రీ, జీఎస్టీ అధికారి వెంకటరమణ అన్నారు. బుధవారం హెచ్.కైరవాడి గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో అనంతశయన, సహకారం సంఘం అధ్యక్షుడు తిమ్మారెడ్డి, టీడీపీ నాయకులు గురునాథ్‌రెడ్డి, రాజేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి పులిరాజు, రాంగోపాల్ పాల్గొన్నారు.
కౌతాళం: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ 2.0తో పేదలకు ప్రయోజనం కలుగుతుందని కౌతాళం ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, ఏవో శేషాద్రి అన్నారు. మండల కేంద్రమైన కౌతాళం రైతు సేవా కేంద్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. జీఎస్టీ ఏసీటీవో నాయక్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.