Home » Encounter
జమ్మూ కశ్మీర్ మళ్లీ ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం, కుల్గాం జిల్లా మరోసారి పేలుళ్ల శబ్దాలతో నిండిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
సమందర్ చాచాగా కూడా పాపులర్ అయిన బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎలాంటి క్లిష్ట మార్గాలలోనైనా ఉగ్రమూకలను భారత్‌లోకి చొరబడేలా ఇతను సహాయం చేసేవాడు.
గత రెండు రోజులుగా వర్షం పడుతున్నా కూంబింగ్ ఆగలేదు. బుధవారం కూంబింగ్‌లో ఉన్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అడవి ప్రాంతంలో తొమ్మిదో రోజు కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కుల్గాం జిల్లాలో శనివారం ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన భద్రతా బలగాలు ఆదివారంనాడు కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తొలుత ఈ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం మొదలైంది.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆపరేషన్‌లో సైన్యం గొప్ప విజయాన్ని సాధించింది. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు.
పహల్గాం ఉగ్రకుట్ర వెనుక ముసా ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది శ్రీనగర్-సోన్‌మార్గ్ హైవేపై జడ్ మోడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ముసా ప్రమేయం ఉంది.
మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు. వీటిలో INSAS, SLR రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు.
ఘాగ్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖాండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఇరువైపులా సుదీర్ఘంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.