Share News

Encounter: భారీ ఎన్‌కౌంట‌ర్‌.. మావోయిస్టులు హతం..

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:44 PM

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో ప‌లువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి.

Encounter: భారీ ఎన్‌కౌంట‌ర్‌.. మావోయిస్టులు హతం..
Bijapur Forests

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా(Bijapur District) అడవులు మరోసారి దద్దరిల్లాయి. ఇవాళ(మంగళవారం) గంగలూర్ పోలీస్ స్టేషన్(Gangalur Police Station) పరిధి బోడ్లా పుస్నార్ అడవుల్లో(Bodla Pusnar Forest) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoists) మధ్య పెద్దఎత్తున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.


ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ప‌లువురు మావోయిస్టులు మృతిచెందినట్లు స‌మాచారం. మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, మావోలు ఎంతమంది మృతిచెందారు, మృతుల్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

YSRCP Attacked TDP Activists: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఓటు వేయడానికి వెళ్తున్న వారిపై దాడి..

Updated Date - Aug 12 , 2025 | 01:02 PM