Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోలు మృతి
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:28 PM
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 24: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈరోజు (బుధవారం) నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కాగా... ఈరోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని కాల్పులు జరిపారు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోలు మరణించారు. వీరు నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన సబ్-జోనల్ కమాండర్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మావోలకు బిగ్ షాక్
ఓ వైపు వరుస ఎన్‌కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది మావోలు అడవిని వీడి వచ్చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా 71 మంది నక్సల్స్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలాగే మిగిలిన మావోయిస్టులూ లొంగిపోయి.. ప్రశాంతమైన జీవనం గడపాలని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజధానిపై మూడు ముక్కలాట.. గత సర్కార్‌పై మంత్రి ఫైర్
వారిపై పీడీయాక్ట్ కేసులు ఖాయం: మంత్రి నాదెండ్ల
Read Latest National News And Telugu News