Home » Eluru
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు గవర్నర్ తెలిపారు.
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) ఏలూరు జిల్లాలోని కలిదిండిలో ’మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు ప్రజా వేదిక, క్యాడర్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా.. గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు.
రోడ్డు కుదుపునకు ప్రాణం లేచొచ్చిన సంఘటన ఇది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి(48) రెండు రోజుల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికిగురయ్యారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేట గ్రామంలో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్ కమిటీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.