Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:19 AM
కొబ్బరి రైతు కన్నీరు పెట్టే పరిస్థితి దాపురించింది. ధర ఒక్కసారిగా తగ్గిపోవండతో ఏం చేయాలో అర్ధంగాని పరిస్థితిలో రైతు దిగాలు చెందుతున్నాడు. ఎపుడూ లేని విధంగా ఈసారి కొబ్బరి ధర బంగారం రేటు వలే రోజు రోజుకు పెరిగిపోయింది. దీంతో కొబ్బరి రైతులకు కాసుల వర్షం కురిపించింది.
- ధర పెరుగుతుందని భారీగా నిల్వలు పెట్టిన వ్యాపారులు
- గతంలో వెయ్యి కాయలు రూ.25 వేలు
- నేడు రూ.10వేలకు పడిపోయిన ధర
ఆచంట(ఏలూరు): ఎపుడూ లేని విధంగా ఈసారి కొబ్బరి ధర బంగారం రేటు వలే రోజు రోజుకు పెరిగిపోయింది. దీంతో కొబ్బరి రైతులకు కాసుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా కొబ్బరికాయ రేటు వెయ్యి కాయలు 25 వేల రూపాయలు పైగానే ధర పలకడంతో అటు రైతులు ఒక్కసారిగా తమ ఆనందం వ్యక్తం చేశారు. ధర పెరగడంతో వ్యాపారుల్లో కూడా తమ వ్యాపారం బాగా బాగుందని వారు కూడా సంతోషడ్డారు. ఈ ధర సుమారు 4 నెలలు ఉన్నది. అయితే ఇటీవల మరలా ఒకేసారి కొబ్బరి ధర దిగి వచ్చింది.

ప్రస్తుతం వెయ్యి కాయ ధర పది వేల రూపాయలు మాత్రమే ఉండటంతో రైతుల్లో మరలా అసహనం నెలకొంది. ఇప్పటి వరకు కొబ్బరి ధర పెరగడంతో వ్యాపారులు కూడా తమకు తగ్గ స్థాయిలో కొబ్బరి కాయలను లక్షల్లో నిల్వ పెట్టారు. అయితే ఒకే సారి ధర పతనం కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది. ఒకే సారి కొబ్బరి ధర ఇలా పతనం కావడం ఎపుడూ లేదని కొంత మంది వ్యాపారులు, రైతులు అం టున్నారు.

అయితే ప్రస్తుతం ఎటువంటి పండుగలు కూడా లేకపోవడంతో కొబ్బరి ధర పడిపోవడానికి కారణమని, అలాగే కర్ణాటక(Karnataka) వంటి రాష్ట్రాల నుంచి కొబ్బరి ఎగుమతి ఎక్కువ ఉన్న కారణంగా ధర పతనమైందని మరికొంత మంది చెబుతున్నారు. ఏదేమైనప్పటికి కొబ్బరి ధర విషయంలో నాలుగు నెలల ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. ధర పెరిగితేనే నష్టాల నుంచి గట్టెక్కుతామని వ్యాపారులు అంటున్నారు. కొబ్బరి ధర మరింత తగ్గుతుందా.. పెరుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
అది బూటకపు ఎన్‌కౌంటర్: ఈశ్వరయ్య
Read Latest Telangana News and National News