గంజాయి వల్లే లేడీ డాన్లు తయారు: సీఎం
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:09 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిని ఏ మాత్రం అడ్డుకోలేదని.. దానిని విక్రయించడంతో పాటు తాగడం
ఏలూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిని ఏ మాత్రం అడ్డుకోలేదని.. దానిని విక్రయించడంతో పాటు తాగడం వల్ల కొందరు మహిళలు లేడీ డాన్లుగా తయారయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘వామ్మో.. లేడీ డాన్లు’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రజావేదికపై ఘాటుగా స్పందించారు. గంజాయి నివారణను జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళలు కొందరు గంజాయి అమ్ముతూ తాగడం కూడా అలవాటు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.