Home » Elections
బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్‌ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.
రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడంతో తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయించి ఎన్నికలు ఆపాలని చూస్తే చేసేది ఏం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.