Home » Donald Trump
రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సుంకాలు, ఆంక్షలు అంటూ కలకలం రేపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు.......
మొన్నటివరకు సుంకాల పేరుతో భారత్‌పై వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాను కూడా టార్గెట్ చేసుకున్నారు. తాజాగా మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ‘ప్రపంచ శాంతి దూత’గా అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు....
నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. ఇవాళ అవార్డు ప్రకటనకు ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు.
నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేసే నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఎవరిని వరిస్తుందా అన్నది ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. నేటి ప్రకటనలో డోనాల్డ్ ట్రంప్ పేరు..
గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న మారణహోమానికి తెరపడేందుకు రంగం సిద్ధమైంది. నోబెల్ శాంతి బహుమతిపై ఆశతో గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి....
గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు ముందుకొచ్చాయని, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలు అంతర్జాతీయ సమీకరణాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా, చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్, చైనాకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది.
హమాస్ సంధికి ఒప్పుకుందని చెప్పేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూకు ఫోన్ చేసిన ట్రంప్ ఆయనపై మండిపడ్డారు. నేతన్యాహూ నిరాసక్తంగా వ్యవహరించడంతో ఆయనది ఎప్పుడూ వ్యతిరేక ధోరణే అంటూ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత్‌ను బెదిరించలేమని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని సింగపూర్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని సెటైర్లు పేల్చారు. బహుళ ధ్రువ ప్రపంచానికి ఇది నిదర్శనమని అన్నారు.