Trump warning Venezuela: నేను చెప్పినట్టే చేయకపోతే.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక..
ABN , Publish Date - Jan 05 , 2026 | 08:55 AM
తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డిల్సీ రోడ్రిగ్స్‌కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డిల్సీ రోడ్రిగ్స్ (Delcy Rodríguez)ను నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆమె వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు (US Venezuela relations).
వెనెజువెలా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలుచేయాలని, లేకపోతే డిల్సీ రోడ్రిగ్స్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. తాను చెప్పినట్లు చేస్తే వెనెజువెలాకు ఇకపై అమెరికా సైన్యాన్ని పంపనని ట్రంప్ మాటిచ్చారు. కాగా, వెనెజువెలా చమురు రంగాన్ని మాత్రం నియంత్రిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో స్పష్టం చేశారు (Donald Trump statement).
వెనెజువెలాను నేరుగా పరిపాలించబోమని, ఆ దేశ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో తేల్చి చెప్పారు (Latin America politics). వెనెజువెలా ప్రజలు మేలు కోసం ఆ దేశ చమురు పరిశ్రమలో మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..