Share News

Shootings: వెనెజువెలా అధ్యక్ష భవనం వద్ద కాల్పుల కలకలం.. భయం గుప్పిట్లో ప్రజలు

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:32 PM

అమెరికా సైనిక దళాలు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం రాజధాని కారకాస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Shootings: వెనెజువెలా అధ్యక్ష భవనం వద్ద కాల్పుల కలకలం.. భయం గుప్పిట్లో ప్రజలు
Venezuela Political Instability

ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలా(Venezuela)లో నెలకొన్న రాజకీయ సంక్షోభం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా(America) బలగాలు జనవరి 3న అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ దేశ రాజధాని కారకాస్‌(Caracas)లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మాదకద్రవ్య ఆరోపణలను ఎదుర్కొనేందుకు మదురోను అమెరికాకు రప్పించడానికి జరిపిన ఆపరేషన్‌లో కనీసం 24 మంది వెనెజువెలా భద్రతాధికారులు మరణించారని అధికారులు ధ్రువీకరించారు. మదరో స్థానంలో వెనెజువెలా సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodriguez) తాత్కాలిక అధ్యక్షరాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే అధ్యక్ష భవనం(Palacio de Miraflores) వద్ద కాల్పుల మోత వినిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


సెంట్రల్ కారకాస్‌లో ఉన్న మిరోఫ్లోర్స్ ప్యాలెస్ (Miroflores Palace) పరిసరాల్లో అనుమానాస్పదంగా డ్రోన్లు ఎగరడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. వాటిని నిలువరించేందుకు భద్రతా సిబ్బంది(Security personnel) కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ హానీ జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నప్పటికీ.. నగరం మొత్తం భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డెల్సీ రోడ్రిగ్జ్.. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం యుద్దం ఆపే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విముఖత వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది. ఆ దేశాన్ని తాత్కాలికంగా అమెరికానే నడిపిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని అమెరికా స్పష్టం చేసింది. వెనెజువెలాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని.. అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాల మధ్య సమన్వయ లోపం కారణంగానే కాల్పులు జరిగి ఉండొచ్చని అమెరికా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Updated Date - Jan 07 , 2026 | 04:03 PM