Home » Doctor
పెళ్ళికి ముందే హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావాలని హుబ్బళ్ళికి చెందిన ప్రముఖ వైద్యులు భరత్‌రాజ్ పి యాళగి రెండోసారి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ళ కిందటనే ఇటువంటి ప్రస్తావన ఒకటి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని చర్చి కాంపౌండ్ రోడ్డులో ఉన్న మహాగణపతి ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు
విశ్రాంతి లేకపోవడం, పని ఒత్తిడి మెదడు జబ్బులకు దారితీస్తోందంటున్నారు వైద్యులు. మానసిక ఒత్తిడితో బీపీ, షుగర్ పెరగడం, డిజిటల్ ఓవర్‌లోడ్, నిరంతరం స్ర్కీన్‌లను చూడటం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల యువత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుందని వైద్యులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది.. గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కారణంగా చనిపోతున్నారని.. మన దేశంలోనూ ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్టార్ ఆస్పత్రి ఎండీ, సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మన్నం గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అమానుష ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన గాయత్రి ఆస్పత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లుగా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు ఆస్పత్రిపై దాడులు చేశారు.
పాన్వెల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణకి నొప్పులు తీవ్రం కావడంతో ఝాన్సీ స్టేషన్‌లో ఆమెను కిందకు దించారు. పరిస్థితి గమినించిన ఒక మహిళా టిక్కెట్ స్టాఫ్ మెంబర్, మరొక ఆర్మీ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. డాక్లర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు.
వైద్యశాఖలో నియామకాల జోరు కొనసాగుతోంది. 201 మంది వైద్యుల నియామక తుది జాబితాను వైద్య నియామకాల బోర్డు శనివారం విడుదల చేసింది.
తీవ్ర రక్తస్రావం, గర్భాశయ ఫైబ్రాయిడ్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు మెడికవర్ ఉమెన్ చైల్డ్ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.
డాక్టర్స్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకి జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు చెప్పారు.