Health: రోగుల భద్రత ముఖ్యం..
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:56 AM
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం వల్ల కాకుండా, సురక్షితం కాని ఆరోగ్య సంరక్షణ చర్యల వల్ల ఏర్పడే ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. రోగి భద్రత అనేది కేవలం వైద్యపరమైన సంరక్షణ మాత్రమే కాదని, ఆస్పత్రులు, రోగులు, వారి కుటుంబాలు పంచుకునే నిబద్ధత అని వైద్యులు పేర్కొంటున్నారు.
- నేడు ప్రపంచ రోగుల భద్రత దినోత్సవం
హైదరాబాద్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం వల్ల కాకుండా, సురక్షితం కాని ఆరోగ్య సంరక్షణ చర్యల వల్ల ఏర్పడే ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. రోగి భద్రత అనేది కేవలం వైద్యపరమైన సంరక్షణ మాత్రమే కాదని, ఆస్పత్రులు, రోగులు, వారి కుటుంబాలు పంచుకునే నిబద్ధత అని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్య పరమైన లోపాల కారణంగా ఏటా సుమారు 5.2 మిలియన్ల తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇది ప్రతి సంవత్సరం దాదాపు 3 మిలియన్ల అనివార్యమైన మరణాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోగి భద్రత అనేది ఆస్పత్రి కార్య నిర్వహణలో ప్రధానమైనది. ప్రతి రోగి అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు, భద్రతా ప్రమాణాల ద్వారా మార్గనిర్దేశనం చేశారని వైద్యులు వివరించారు.
లోపాలు ఎందుకంటే..
ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో భయం. సరైన నివేదిక వ్యవస్థలు లేకపోవడం, విభాగాల అంతటా పేలవమైన టీమ్‌వర్క్ కమ్యూనికేషన్, సిబ్బంది కొరత, పరిమిత మౌలిక సదుపాయాలు, ప్రామాణిక ప్రొటోకాల్ లేకపోవడం.

సూచనలు అనుసరించాలి
రోగి భద్రత అనేది కేవలం ఆస్పత్రుల బాధ్యత మాత్రమే కాదు.. ఇది ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, రోగులు, కుటుంబాల మధ్య ఒక భాగస్వామ్య ప్రయత్నం. ప్రతి రోగి ముఖ్యమైన సూచనలు అనుసరించాలి. రోగి వైద్య చరిత్ర (ఇటీవల ఆస్పత్రుల సందర్శనలు, చికిత్సలు లేదా ఇన్ఫెక్షన్లు) గురించి డాక్టర్లకు తెలియజేయాలి. సంరక్షణ, మందులు, పరీక్ష ఫలితాల గురించి ప్రశ్నలు అడగడానికి సంకోచించ వద్దు.
- డాక్టర్ రమేష్ గూడపాటి, సీనియర్ కార్డియాలజిస్టు, జాయింట్ డైరెక్టర్, స్టార్ ఆస్పత్రి లక్షణాలను వివరించాలి జ్వరం, డయేరియా వంటి లక్షణాలను వివరించాలి.
అనవసరమైన యాంటీబయాటిక్స్‌ని నివారించాలి. దుష్ప్రభావాలను వివరించాలి. చేతుల పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, సందర్శకులకు వారి చేతులను కడుక్కోవాలని గుర్తు చేయాలి. పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి. సాధారణ సూచనలు అనుసరించడం ద్వారా, రోగులు, సంరక్షకులు ఇన్ఫెక్షన్లు, లోపాల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- డాక్టర్ గోపీచంద్ మన్నం,
మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News