Hyderabad: కింగ్‌కోఠి ఆస్పత్రిలో బాల భీముడు జననం
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:19 AM
కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో బాల భీముడు జన్మించాడు. పురిటి నొప్పలతో అడ్మింట్ అయిన గర్భిణికి ఆస్పత్రి వైద్యులు బుధవారం అర్ధరాత్రి 2.18 గంటలకు సాధారణ ప్రసవం చేశారు.
హైదరాబాద్ సిటీ: కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రి(King Kothi Government Hospital)లో బాల భీముడు జన్మించాడు. పురిటి నొప్పలతో అడ్మింట్ అయిన గర్భిణికి ఆస్పత్రి వైద్యులు బుధవారం అర్ధరాత్రి 2.18 గంటలకు సాధారణ ప్రసవం చేశారు. మారేడ్‌పల్లిలోని అర్యా నగర్ నివాసి నూరియన్ సిద్దిక్యూ(23) గర్భం దాల్చడంతో ఆమె ఆస్పత్రిలో మాత శిశుసంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లోని గైనాకాలజీ డాక్టర్ జ్యోతిర్మయి(Gynecology Dr. Jyotirmayi) పరిశీలనలో వైద్యం చేయించుకున్నారు.

ఆమెకు నొప్పులు రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని వైద్య సేవలు అందించగా సాధరణ ప్రసవం కావడంతో పాటు 5కిలోల బరువు గల మగశిశువు జన్మించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబు, ఆర్‌ఎంఓ డాక్టర్ సాధన తెలిపారు. 39 వారాలకు ఆమె ప్రసవించారని తెలిపారు. కింగ్ కోఠి ఆస్పత్రిలో 5 కిలోల శిశువు జన్మించడం ఇదే మొదటి సారని డాక్టర్ సంతోష్ బాబు చెప్పారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News