Health: ఇప్పుడు 25 ఏళ్లకే గుండె జబ్బులు..
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:33 AM
వ్యాయామం చేయడంలో నిర్లక్ష్యం వహించడం, శక్తిహీనం కావడం, జీవనశైలి మార్పులు, విటమిన్ డి, బీ12, రక్తహీనత వంటి వాటితో 25 ఏళ్లకే యువత గుండెజబ్బులకు గురవుతున్నారని అపోలో ’హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ అధ్యయనం స్పష్టం చేసింది.
- వ్యాయామం విషయంలో యువత నిర్లక్ష్యం..
- విటమిన్ డి, బీ12, రక్తహీనత లోపాలు సైతం
- జీవనశైలిలో మార్పులు.. అపోలో ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీ: వ్యాయామం చేయడంలో నిర్లక్ష్యం వహించడం, శక్తిహీనం కావడం, జీవనశైలి మార్పులు, విటమిన్ డి, బీ12, రక్తహీనత వంటి వాటితో 25 ఏళ్లకే యువత గుండెజబ్బులకు(Heart diseases) గురవుతున్నారని అపోలో ’హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ అధ్యయనం స్పష్టం చేసింది. చాలామంది అకస్మాత్తుగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఆర్టరీల్లో కాల్షియం పేరుకుపోవడం, కొవ్వు కాలేయం, నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోవడం (స్లీప్ అప్నియా) వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రకటించింది.

రజస్వలానంతరం యువతుల్లో కూడా గుండె వ్యాధి ప్రమాదం ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వీరికి ప్రత్యేక స్ర్కీనింగ్ అవససరమని సూచించింది. ఇదిలా ఉండగా, 1983 నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా గుండె శస్త్రచికిత్సలను అపోలో ఆస్పత్రి విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొంది. కాగా, హైదరాబాద్‌లో ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో 80 శాతం మంది ఇబ్బంది పడుతున్నారని, డయాబెటిక్, రక్తపోటు ఉన్న వారిలో 75 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నట్లు గుర్తించారు.
మీ రక్తపోటు తెలుసుకోండి
మీ రక్తపోటు తెలుసుకోవాలి. ఆరోగ్య సంఖ్యలు తెలుసుకోవాలి. మంచి నిద్రపోవాలి. చురుకుగా ఉండాలి. సమయానికి వైద్య సలహా తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు చాలా వరకు సరైన సమయంలో గుర్తింపు, చికిత్స, జీవనశైలి మార్పులతో నివారించవచ్చు. ఈ ఏడాది థీమ్ ‘ఈ డోట్ మిస్ ఎ బీట్’ నినాదంగా తీసుకున్నారు. గుండె సంరక్షణలో జాగ్రత్తగా ఉండాలి.’
- డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి, చైర్మన్ అపోలో ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News