Home » DMK
ఇండియా కూటమి ముఖ్య భాగస్వామి కాంగ్రెస్ టీవీకే పార్టీతో పొత్తుకు సిద్ధం కావడంపై డీఎమ్‌కే పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఆ హక్కు ఉందని డీఎమ్‌కే ఎంపీ కనిమొళి పేర్కొనగా పార్టీ ప్రతినిధి అన్నాదురై మాత్రం కాంగ్రెస్ నిర్ణయాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు.
తమిళనాడులో డీఎంకే ఓటమి పట్ల ఆ పార్టీ అధినేత స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. వాటిని సమానంగా స్వీకరించే శక్తి తమ పార్టీకి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సెంటర్ల వద్ద అంతరాయాలు కలిగించడానికి బీజేపీ పథక రచన చేస్తోందని అధికార డీఎంకే (DMK) ఆరోపించింది. పెద్దఎత్తున శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారంనాడు లేఖ రాశారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్‌ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
ప్రజాహిత బిల్లులను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుందని పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. 234 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు.