Share News

స్టాలిన్ చెన్నై సూపర్-6 మేనిఫెస్టో.. రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్

ABN , Publish Date - Apr 19 , 2026 | 07:44 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.

స్టాలిన్ చెన్నై సూపర్-6 మేనిఫెస్టో.. రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్
MK Stalin

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది. చైన్న నగరవాసుల కోసం 'చెన్నై సూపర్-6' పేరిట ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారంనాడు ఈ మేనిఫెస్టోను డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేశారు.


నగరంలోని ప్రతివీధిని కలుపుతూ వెయ్యి మినీ బస్సులు తీసుకురావడం, ఏఐ సాయంతో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడం వంటి హామీలను మేనిఫెస్టోలో డీఎంకే పొందుపరిచింది. సిటీవ్యాప్తంగా 10 ప్రధాన ప్రాజెక్టులు, డ్రైనేజీలు, మురుగుకాల్పల పనులను 2027లోగా పూర్తి చేస్తామని, 2028 నాటికి మెట్రో విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. పాదచారుల కోసం విస్తృత పేవ్‌మెంట్లు, రహదారుల వెంబడి పచ్చటి చెట్లు, టాయలెట్ సౌకర్యాలతో రోడ్లను 2029 నాటికి పూర్తి చేస్తామని భరోసా ఇచ్చింది. వీధి కుక్కుల నియంత్రణ, వెటర్నరీ డాక్టర్ల సంఖ్యను మూడింతలు పెంచడం వంటివి మేనిఫెస్టోలో చేర్చింది. రూ.10,000 కోట్లతో టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని, తద్వారా 20,000 ఉన్నత స్థాయి ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపింది.


ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన, ఉన్నత స్థాయి స్కిల్ డవలప్‌మెంట్ ట్రైనింగ్, రీసెర్చ్ హబ్‌లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టో తెలిపింది. కాగా, తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

లోక్‌సభలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యంలో ఛాంపియన్ ఎవరంటే..

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 19 మంది మృతి

Updated Date - Apr 19 , 2026 | 07:54 PM