Share News

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 19 మంది మృతి

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:45 PM

తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సాత్తూరు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారంనాడు భారీ పేలుడు సంభవించి 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 19 మంది మృతి
fire cracker factory blast

విరుధునగర్: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సాత్తూరు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


సంఘటన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా రసాయనాలు కలుపుతున్న సమయంలో మంటలు చెలరేగి వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని పలు గదులు దెబ్బతిన్నాయి. మృతుల్లో పలువురు మహిళా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను విరుధునగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బాణసంచా యూనిట్ గోవందనల్లూరుకు చెందిన ముత్తు మాణిక్యం అనే వ్యక్తికి చెందినదిగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు రామచంద్రన్, తంగమ్ తెన్నరసును ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీని శిక్షించండి: మోదీ పిలుపు

ద్రౌపది వస్త్రాపహరణాన్ని తలపించిన విపక్షాల చర్య: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Apr 19 , 2026 | 05:59 PM