Home » Dharmavaram
అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు.
విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాల్నదే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. గత నెల 16న సం స్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంగ్యాలలోని గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శిక్షణ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు
గ్రామాల అభివృద్ధే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల వరకు, పోతులనాగేపల్లి మీదుగా కనంపల్లికి, ధర్మవరం రోడ్డు నుంచి చింతలపల్లి, వసంతపురం నుంచి చిగిచెర్ల క్రాస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.6.10కోట్లు నిధులు మంజూరయ్యాయి.
తమ గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేస్తే ము న్సిపాలిటీ విఽధించే పన్నులు చెల్లించ లేమని పలు గ్రామాల ప్రజలు, టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. తా మంతా వ్యవసాయం, ఉపాధిహామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్నా మని, మున్సిపాలిటీలోకి తమ గ్రా మాల విలీనం ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్ చేశారు.
రహదారులు సరిగా లేకపోవడంతో మండలపరిధిలోని పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఎవరూ పట్టించుకున్న పాపనపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఎవరూ పట్టించుకో లేదు. అయితే కూటమి ప్రభు త్వం రాగానే గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది.
ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 156 మంది సిబ్బంది ఒక్కసారిగా తనిఖీలకు దిగడంతో ధర్మవరం దద్దరిల్లింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ధర్మవరం, పెనుకొండ డీఎస్పీలు హేమంతకుమార్, నరసింగప్ప, సీఐలు, ఎస్‌ఐలతో కలిసి ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మండలంలోని చిన్నూరుబత్తలపల్లి వరిపొలాల్లోకి రావులచెరువుకు వెళ్లే కాలువనీరు వెళుతుండటంతో సాగురైతులు ఇబ్బందులు పడుతున్నారు. రావులచెరువుకు ధర్మవరం చెరువు నుంచి నీరు విడుదల చేశారు. అయితే చెరువుకు వెళ్లే కాలువ గడ్డితో కుంచించిపోవడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక చిన్నూరుబత్తలపల్లి రైతుల వరి పొలాల్లోకి వెళ్లాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల రానున్న మూడురోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్‌బాబు పేర్కొన్నారు. వారు బుధవారం ధర్మవరం చెరువుతో పాటు పోతుల నాగేపల్లి చిత్రావతి నది, రేగాటిపల్లి, గొట్లూరు చెరువులలో నీటి మ ట్టాన్ని పరిశీలించారు.
పోలీస్ స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ట నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక పో లీస్ స్టేషనను మంగళవారం ఎస్పీ అకస్మిక తనిఖీ చేశారు. రి కార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రాబో యే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.
పోలీసు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో పునరంకితమవుదామని వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారు సెల్యూట్ చేశారు.