WATER: వరి పొలాల్లోకి కాలువ నీరు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:26 PM
మండలంలోని చిన్నూరుబత్తలపల్లి వరిపొలాల్లోకి రావులచెరువుకు వెళ్లే కాలువనీరు వెళుతుండటంతో సాగురైతులు ఇబ్బందులు పడుతున్నారు. రావులచెరువుకు ధర్మవరం చెరువు నుంచి నీరు విడుదల చేశారు. అయితే చెరువుకు వెళ్లే కాలువ గడ్డితో కుంచించిపోవడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక చిన్నూరుబత్తలపల్లి రైతుల వరి పొలాల్లోకి వెళ్లాయి.
ధర్మవరం రూరల్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నూరుబత్తలపల్లి వరిపొలాల్లోకి రావులచెరువుకు వెళ్లే కాలువనీరు వెళుతుండటంతో సాగురైతులు ఇబ్బందులు పడుతున్నారు. రావులచెరువుకు ధర్మవరం చెరువు నుంచి నీరు విడుదల చేశారు. అయితే చెరువుకు వెళ్లే కాలువ గడ్డితో కుంచించిపోవడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక చిన్నూరుబత్తలపల్లి రైతుల వరి పొలాల్లోకి వెళ్లాయి. పంట దిగుబడి సమయంలో నీరంతా చేరుకోవడంతో పంటంతా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పూడికపోయిన మట్టిని తీసివేస్తే సజావుగా నీరు వెళుతుందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చిన్నూరుబత్తలపల్లికి చెందిన సాగురైతులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....