POLICE: పోలీసు అమర వీరులకు నివాళి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:54 PM
పోలీసు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో పునరంకితమవుదామని వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారు సెల్యూట్ చేశారు.
ధర్మవరం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసు అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో పునరంకితమవుదామని వనటౌన, టూటౌన సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్‌స్టేషన ఎదుట ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి వారు సెల్యూట్ చేశారు. అనంతరం సిబ్బంది, విద్యార్థుల చేత అమరవీరుల స్థూపానికి పూలమాల వేయింసి, రెండు నిమిషాలు మౌనంపాటించారు. ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠ శాల ఆవరణంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో సిబ్బంది తదిత రులు రక్తదానం చేశారు. రక్తబంధం ట్రస్టు వ్యవస్థాపకులు కన్నా వెంకటేశ, సభ్యులు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....