ROADS: గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:42 PM
రహదారులు సరిగా లేకపోవడంతో మండలపరిధిలోని పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఎవరూ పట్టించుకున్న పాపనపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఎవరూ పట్టించుకో లేదు. అయితే కూటమి ప్రభు త్వం రాగానే గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది.
30ఏళ్లనాటి ఆధ్వాన రహదారులకు మోక్షం
మంత్రి సత్యకుమార్, పరిటాలశ్రీరామ్ చొరవతో 6.10కోట్లు నిధులు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలు
ధర్మవరం రూరల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రహదారులు సరిగా లేకపోవడంతో మండలపరిధిలోని పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఎవరూ పట్టించుకున్న పాపనపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఎవరూ పట్టించుకో లేదు. అయితే కూటమి ప్రభు త్వం రాగానే గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది. ఆ మేరకు ప్రభుత్వం ధర్మవరం మండలం లోని పలు గ్రామాలకు నూతన రహదారుల కోసం నిధులు మంజూరు చేసింది. దీంతో అధ్వాన రహదారులకు మోక్షం లభించిందని ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 6.10కోట్లు నిధులు మంజూరు
ధర్మవరం మండలంలో పలు గ్రామాలకు వెళ్లేందుకు రహదారులు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల పై ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమయ్యాయి. అదేవిధంగా గ్రామాల కు నూతన తారు రోడ్ల నిర్మాణంపై టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ మహేష్‌చౌదరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రహదారి లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉన్న గ్రామాలకు నూతన రహదారుల నిమిత్తం అధికారులు, గ్రామస్థుల తో చర్చించి ఎస్టిమేట్లు వేయించారు.
అందుకు సంబంధించిన ప్రతిపాదన లు సిద్దం చేసి మంత్రి సత్యకుమార్‌యాదవ్, టీడీపీ నియోజకవర్గ ఇన చార్జ్ పరిటాలశ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు ప్రభుత్వానికి నివేదికలు అందించారు. ప్రభుత్వం స్పందించి ఉపాధిహామీ పథకం కింద రూ.6.10 కోట్లు నిధు లు విడుదల చేసింది. ధర్మవరం మండలంలోని ధర్మవరం రోడ్డు క్రాస్ నుంచి చింతలపల్లి వరకు, వసంతపురం తిక్కయ్యస్వామి గుడి నుంచి చిగిచెర్ల క్రాస్ రోడ్డు వరకు, మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల మీదుగా గొల్లవాండ్లపల్లి రోడ్డు వరకు, పోతులనాగేపల్లి నుంచి కనంపల్లి వ రకు నూతన బీటీ రహదారుల కోసం ఈ నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
త్వరలోనే భూమిపూజ - పాండురంగారెడ్డి, డీఈఈ, ధర్మవరం
ధర్మవరం మండలంలోని పలు గ్రామాలకు నూతన తారురోడ్ల కోసం నిధులు మంజూరయ్యాయి. రోడ్ల నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేసి, పనులు ప్రారంభిస్తాం. ఈ రహదారులను త్వరగానే పూర్తి చేయిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....