Share News

TDP: మున్సి.పాలిటీలోకి మా గ్రామాల విలీనం వద్దు

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:05 AM

తమ గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేస్తే ము న్సిపాలిటీ విఽధించే పన్నులు చెల్లించ లేమని పలు గ్రామాల ప్రజలు, టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. తా మంతా వ్యవసాయం, ఉపాధిహామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్నా మని, మున్సిపాలిటీలోకి తమ గ్రా మాల విలీనం ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్‌ చేశారు.

TDP: మున్సి.పాలిటీలోకి మా గ్రామాల విలీనం వద్దు
TDP leaders and people protesting with placards

ప్రజలు, టీడీపీ నాయకుల డిమాండ్‌

ధర్మవరం రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తమ గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేస్తే ము న్సిపాలిటీ విఽధించే పన్నులు చెల్లించ లేమని పలు గ్రామాల ప్రజలు, టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. తా మంతా వ్యవసాయం, ఉపాధిహామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్నా మని, మున్సిపాలిటీలోకి తమ గ్రా మాల విలీనం ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని పోతులనాగేపల్లి, తుంపర్తి కాలనీ, కుణుతూరుకాలనీ, రేగాటిపల్లి, పోతుకుంట కాలనీ లను ధర్మవరం మున్సిపాలిటీలోకి విలీనం చేసేందుకు ఆమోదం తెలిపే సన్నహాలు జరుగుతున్నాయి. దీంతో విలీనం ప్రక్రియను ఆపాలని ఆయా గ్రామాల ప్రజలు టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జ్‌ మహేష్‌చౌదరి ఆధ్వర్యంలో గురు వారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ సాయి కృష్ణ, టౌనప్లానింగ్‌ అధికారి అలివేలమ్మకు వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కుట్రపూరితంగా తమ గ్రామాలను మున్సిపాలటీలోకి విలీ నం చేసే ప్రక్రియ తగదన్నారు. గ్రామాలలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఉన్నఫలంగా మున్సిపాలిటీలోకి విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వెంట నే ఉపసంహరించుకో వాలని నినాదాలు చేశారు. తాము మున్సిపాలిటీలో విధించే పన్నులు కట్టలేమన్నారు. విలీ నం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీఎత్తున నిర సన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి విజయసారథి, తలారి వెంకటలక్ష్మి, పోతుకుంట రవి, కొండారెడ్డి, రమేష్‌, పోతుల నాగేపల్లి ఆదెప్ప, కత్తేకొట్టాల ప్రసాద్‌, భాస్కర్‌చౌదరి, అమర సుధాకర్‌, పోతుకుంట నారాయణస్వామి, డీలర్‌ గవ్వల రామాంజినేయులు, ఐటీడీపీ రాము తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 24 , 2025 | 12:05 AM