Home » Dharmavaram
మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్డుంతా దుర్వాసతో వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. నాగలూరు గ్రామంలో ఇళ్లమధ్యనే మురుగునీరు నిలిచాయి. డ్రైనేజీలో నీరు పారక ఎక్కడిక్కడ స్తంభించాయి.
రైతులు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా అందజేస్తామని ఆర్డీఓ వీవీఎస్ శర్మ పేర్కొన్నారు. ఆయన మండలంలోని కొర్తికోట గ్రా మంలో బుధవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరపున కొర్తికోట రైతులకు 6.30 మెట్రిక్ టన్నుల యూరియాను అందించామన్నారు. రైతులు ఇబ్బందు లు పడాల్సిన అవసరం లేదన్నారు.
అనంతపురంలో జరిగే సూ పర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగసభ సందర్భంగా ధర్మవరంలో అడిష నల్ ఎస్పీ శ్రీనివాసులు, నంది కొట్కూరు సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. సూపర్‌హిట్ సభను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు ఽఽధర్మవరం, ఎనఎస్‌గేటు మీదుగా వెళ్లాయి.
డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఉపన్యాసం ప్రారంభం కాగానే జనసేన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఒక్కసారిగా బారికేడ్లను దాటుకోని సభాప్రాంగణం వద్దకు దూసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఉపన్యాసం ప్రారంభం కాగానే ఒక్కసారిగా జనసైనికులు జెండాలతో వీవీఐపీ, వీఐపీ, పాత్రికేయులకు ఏర్పాటుచేసిన గ్యాలరీలోకి వేగంగా రా వడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు.
సూపర్ సిక్స్- సూపర్ హిట్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రత్యేక చొరవ చూపారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన సాయం అందిం చేలా ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా తరలివస్తున్న ప్రజల కోసం పరిటాల శ్రీరామ్ కుటుంబం తరఫున 1.50లక్ష మందికి పండ్లు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీచేశారు.
అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ సభకు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపు నిచ్చారు. తెలుగుమహిళలు మంగళవారం 33వ వార్డులో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. స్ర్తీశక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం పథకాలతో ప్రతి మహిళ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.
అనంతపురంలో బుధవారం నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగ సభను చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలి పారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ధర్మవరం, ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని బీజేపీ కార్యాల యాల్లో మంగళవారం పార్టీశ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు.
మేత మేస్తూ ఓ పాడి గేదె ప్రమాదవశాత్తు బావిలో పడింది. అందులో నీళ్లు ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కానీ బయటకు వచ్చే మార్గం కాన రాక ఆ గేదె నీళ్లలోనే ఈదుకుంటూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత రైతు గేదె కోసం వెతకగా బావిలో కనిపించింది.
ఐసీడీఎస్ ధర్మవరం ప్రాజెక్ట్ పరిధిలో అంగనవాడీ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సరఫరా చేస్తున్న పౌషికాహారాన్ని కూడా చిన్నా రులకు సక్రమంగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మ వరం ఐసీడీఎస్ ప్రాజెక్టులో 230 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 110 వరకు అద్దె భవనాల్లో నడుపుతున్నారు. చాలా కేంద్రాలను ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతోనే నడుపుతున్నారు.
కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ చే స్తున్న తప్పుడు ప్రచారాలకు ‘సూపర్‌సిక్స్- సూపర్‌హిట్’ సభ ద్వారా సమాధానం చెబుతామని రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్, అమలాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు ఆనందరావు, ఉగ్రనరసింహ, టీడీపీ నియోజక వర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు.