ACCIDENT: ముందు టైరు పగిలి దూసుకెళ్లిన కారు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:36 AM
మండలంలోని పోతుకుం ట బీసీకాలనీ వద్ద బుధ వారం వెళ్తున్న కారు ముందుటైరు పగలడంతో రోడ్డు పక్కన ఉన్న ద్విచ క్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. మా మిళ్లపల్లి నుంచి ధర్మ వరం వైపు వెళ్తున్న కర్ణాట కకు చెంది న ఓ కారు వెళ్తోంది. అయితే ఉన్నఫళంగా కారు ముందు టైరు పగిలి రోడ్డుపక్కకు దూసుకుపోయింది.
ధర్మవరం రూరల్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతుకుం ట బీసీకాలనీ వద్ద బుధ వారం వెళ్తున్న కారు ముందుటైరు పగలడంతో రోడ్డు పక్కన ఉన్న ద్విచ క్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. మా మిళ్లపల్లి నుంచి ధర్మ వరం వైపు వెళ్తున్న కర్ణాట కకు చెంది న ఓ కారు వెళ్తోంది. అయితే ఉన్నఫళంగా కారు ముందు టైరు పగిలి రోడ్డుపక్కకు దూసుకుపోయింది. అయితే రోడ్డుపక్కన ధర్మవరం డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ చంద్ర తన ద్విచక్రవా హనాన్ని నిలిపి తన మిత్రుడితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయి కారు నిలిచిపో యింది. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి గాయాలు కాకవడంతో పెనుముప్పు తప్పిందని స్థానికులు ఊపీరి పీల్చుకున్నారు. రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.