MARKET: అపరిశుభ్రంగా కూరగాయాల మార్కెట్
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:50 PM
పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌లో అపరిశుభ్రత తాండవిస్తోంది. కుళ్లిన కూరగాయాలు, చెత్తాచెదారాన్ని మార్కెట్ యార్డులో ఎక్కడపడితే అక్కడ వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అదేవిధంగా మార్కెట్‌యార్డులో సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం పైభాగంలో ఉంది. ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వె ళుతుంటారు.
అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ధర్మవరం రూరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌లో అపరిశుభ్రత తాండవిస్తోంది. కుళ్లిన కూరగాయాలు, చెత్తాచెదారాన్ని మార్కెట్ యార్డులో ఎక్కడపడితే అక్కడ వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అదేవిధంగా మార్కెట్‌యార్డులో సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం పైభాగంలో ఉంది. ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వె ళుతుంటారు. కింద అంతా అపరిశుభ్రంగా ఉండడంతో మార్కెట్‌కు వచ్చే ప్రజలతో పాటు, సబ్‌రిసా్ట్రర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్తాచెదారం, కుళ్లినకూరగాయాలు వేయడంతో దుర్వాసన రావడంతో కార్యాలయం వచ్చే ప్రజలు ముక్కుమూసుకుని పోవాల్సి పరిస్థితి వచ్చింది. ప్రజలు తినే కూర గాయాల మార్కెట్‌లో ఇలా అపరిశుభ్రంగా ఉంటే రోగాలు రావా అంటూ మండిపడుతున్నారు. కనీసం రెండుమూడు రోజుల కొక సారి అయినా మార్కెట్‌ను శుభ్రం చేయకపోతే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి కూరగాయాల మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....