COLLECTOR: పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:13 AM
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సేవల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు.
ధర్మవరం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సేవల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. బస్టాండ్‌లో మరుగుదోడ్లు, షాపులు, డ్రైనేజీ వ్యవస్థ, లైటింగ్, ఇతర సౌకర్యాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న బస్టాండ్‌లో పారిశుధ్య నిర్వహణ ప్రాధాన్యం పెంచాలని ఆర్టీసీ అదికారులను ఆదేశించారు. ఆర్డీఓ మహేశ, తహసీల్దార్ సురేశబాబు,వీఆర్వో రవిశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం సత్యనారాయణ పాల్గొన్నారు.
ఓటరు జాబితాపై కలెక్టర్ సమీక్ష: మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఓటరు జాబితాప్రత్యేక సవరణ-2025 ఫ్రీ-ఆర్టివిటీ పురోగతిపై కలెక్టర్ శ్యాంప్రసాద్ బీఎల్‌ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రీ-యాక్టివిటీ క్యాంపెయిన్లో ఎన్నికల కమిషన నిర్దేశించిన విధంగా ఎలక్టోరల్ రోల్ డేటాను వేగంగా, కచ్చితంగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఓటర్ల వివరాలు, చిరునామాలు, కుటుంబాల మ్యాపింగ్, గృహ నెంబర్ల వంటి అంశాల్లో తప్పులకు తావు ఇవ్వకుండా జాగ్రత్తతో పనిచేయాలని ఆదేశించారు.ఆర్టీఓ మహేశ, మున్సిపల్ కమిషనర్ సాయికృష్ణ పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ల తనిఖీ
ధర్మవరంరూరల్: పట్టణంలోని మార్కెట్‌యార్డులో ఉన్న ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం గుర్తింపుపొందిన రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. గోడౌన వద్ద సీసీకెమెరా వ్యవస్థ, ఫైర్‌సేఫ్టీ, 24గంటల భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురే్‌షబాబు, వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.