Home » Devotees
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన అనంతరం భక్తుల పూజా కార్యక్రమాలు మరియు శోభాయాత్రలు నిర్వహించబడ్డాయి.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు, ఇతర ఆలయాలకూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan: భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.
ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులకు ఎదురైన అనుభవాలు ఇవి. కాకతీయుల శిల్పకళావైభవానికి ప్రతీకైన చారిత్రాత్మక నిర్మాణాన్ని చూసి వారంతా మైమరిచిపోయారని స్థానిక గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ చెప్పారు.
కాళేశ్వరంలో శ్రీ మాధవానంద సరస్వతి పుష్కరాలు రేపు ప్రారంభం. 17 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.
ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది.భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు.
Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.