Home » Devotees
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదంతా ఎన్నో పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే, సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే ప్రత్యేకమైన పర్వదినం మాస శివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని నిష్ఠతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మాస శివరాత్రి నాడు ఈ మంత్రాలను పఠించే భక్తులకు శివానుగ్రహం దక్కుతుందని అంటారు.
తిరుమల తిరుపతి పాలకమండలి మంగళవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 25 నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర మాసం పూర్తయ్యేవరకూ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
ఆగస్టులో కుటుంబసమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి. ఆఖరి నిముషంలో రూ.300 టికెట్లు అన్నీ అమ్ముడుపోయినా మరో మార్గముంది. ఇలా ప్రయత్నిస్తే కోరుకున్నట్టుగా నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.
గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో జులై 16న ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది.
గురుపౌర్ణమి వేళ భద్రకాళి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పుడమి తల్లిగా 12 మంది అర్చకులు 15 వేల కిలోల కూరగాయలతో..
విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని పది టన్నుల కూరగాయలతో అలంకరించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జులై 8 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి.
Tholi Ekadashi Rituals and Benefits: హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజును తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచే విష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు,ఇవాళ నుంచే హిందువుల పండగలు మొదలువుతాయి.