Home » Deputy CM Pawan Kalyan
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వ్యాఖ్యానించారు.
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనను అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు.
మన చిన్నప్పటి నుంచి చదివిన కథలు వేరు.. జరిగింది వేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. జిజియా పన్ను గురించి తాను చిన్నప్పుడు చదువుకున్న విషయం ఈ సినిమా చేసేటప్పుడు గుర్తు వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకుని పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.
హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.
తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. రాజధాని భూ సమీకరణపై తన నిర్ణయాన్నిఇప్పటికే సీఎం చంద్రబాబుకి చెప్పానని తెలిపారు.