Pawan Kalyan Meeting: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ భేటీ..
ABN , Publish Date - Oct 04 , 2025 | 09:40 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని ఆయన సూచించారు.
అమరావతి: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా అందరూ పాల్గొన్నట్లు సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. నామినేట్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించారు. అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలన్నారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాగా, సుమారు రెండున్నర గంటలపాటు జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపైనా చర్చించారు. అధికారంలోకి రాకముందు చేసిన పోరాటాలను మర్చిపోకూడదని.. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని సూచించారు. మరోవైపు అక్టోబర్ నుంచి పలు జిల్లాల్లో పవన్ పర్యటించనున్న నేపథ్యంలో త్రిశూల వ్యూహంపైనా సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ