Home » Delhi
ఢిల్లీ పేలుడు ఘటన స్థలంలో తగలబడుతున్న కార్లలో CNG ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని, పరిశీలిస్తున్నారని సమాచారం. పేలుడు కారణాలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ సీపీ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో ఈ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. 10 మంది చనిపోగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి
ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో రేపు(మంగళవారం) ఎన్నికలు జరిగే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేసి మాట్లాడారు.
రోడ్డుపై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడివుండటం తాను చూశానని, అసలు ఏం జరిగిందో అప్పుడు తమకు అర్థం కాలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుడు ధాటికి పలు కార్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు యావత్ భారతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు..
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ..
స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ది డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. దాదాపు 30 శాతం గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది.